హెల్త్ ఎమర్జెన్సీ పేరుతో 2 లక్షలు కొట్టేసింది

హెల్త్ ఎమర్జెన్సీ పేరుతో 2 లక్షలు కొట్టేసింది

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మెడికల్‌‌‌‌‌‌‌‌ ఎమర్జెన్సీ పేరుతో చీటింగ్ చేస్తున్న మహిళను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్​లోని అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌కి చెందిన హేమలి(28) ఇతరుల ఫేస్ బుక్ నుంచి వారి ఫొటోలను డౌన్ లోడ్ చేసి తన వాట్సాప్ డీపీ(డిస్ ప్లే పిక్) గా పెట్టుకునేది. తర్వాత వారి ఫేస్ బుక్ అకౌంట్​లో ఉన్న ఫ్రెండ్స్ నంబర్లను తీసుకుని వాట్సాప్ నుంచి మెసేజ్ చేసేది. హెల్త్‌‌‌‌‌‌‌‌ ఎమర్జేన్సీలో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్లు చెప్పి అకౌంట్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాట్సాప్‌‌‌‌‌‌‌‌లో పంపేది. ఇలా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేసేలా ప్లాన్ చేసేది.  గతేడాది  గోల్కొండకు చెందిన లవ్లీన్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి హేమలి రూ.2 లక్షలు వసూలు చేసింది. బాధితుడి కంప్లయింట్​తో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. బ్యాంక్ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌, ఐపీ, ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా నిందితురాలిని అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో అరెస్ట్ చేసినట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.