హైదరాబాద్లో ఎన్నో చారిత్రాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అందులో మనకు తెలిసినవి కొన్ని. తెలియనివి ఇంకెన్నో ఉంటాయి. రెగ్యులర్గా వెళ్లే ప్లేసులే కాకుండా డిఫరెంట్గా వెళ్లాలనుకునే వారికి ట్రావెలింగ్ వ్లాగర్స్ ఎంతో ఉపయోగపడుతున్నారు. కొత్త ప్రాంతాలను వెతికి తీసే ప్రయత్నమే కాదు.. ట్రావెలింగ్ ఖర్చులను కూడా క్లియర్గా చెప్పేస్తున్నారు. అందుకే ఈ మధ్య ట్రావెలింగ్ వ్లాగర్స్కు ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు.
భాగ్యనగరం అంటేనే ఎన్నో చారిత్రక కట్టడాలు, పచ్చని పార్కులు, రుచికరమైన ఆహరం.. ఇలా అన్నింటికి చాలా ఫేమస్. వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ లో మనం చూసిన ప్లేసులు కొన్నే ఉంటాయి. చూడనివి మాత్రం వందల్లో ఉండొచ్చు. వాటి గురించి నిమిషంలోనే పూర్తి వివరాలు ట్రావెలింగ్ వ్లాగర్స్ చెప్తున్నారు. సరదాగా బయటికి వెళ్లాలంటే ఎక్కడికి వెళ్లాలి..? ఫ్రెండ్స్ తో అయితే ఏ ప్లేస్ బెటర్..? ఫ్యామిలీకి ఏ ప్లేస్ బెస్ట్..? పిల్లల్ని వీకెండ్ కు ఎక్కడికి తీసుకెళ్లాలని..వెళ్తే ఎంత ఖర్చు అవుతుందోనని ఆలోచిస్తుంటారు. ఈ డౌట్స్ అన్నింటిని ట్రావెలింగ్ వ్లాగర్స్ క్లియర్ చేస్తున్నారు. వారు కొత్త ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు.. వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి..అందరికీ చూపించడం మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటున్నారు.
షాట్ వీడియోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ వేలమంది అభిమానులను సంపాదించుకోవడం కోసమే కాదు.. ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వ్లాగర్స్. బెస్ట్ ప్లేస్, మంచి ఫుడ్, క్రేజీ లోకేషన్, అదిరిపోయే స్పాట్స్, రీజనబుల్ ఫ్రైజ్ ఇలాంటివి ఎన్నో నగరవాసులకు చూపిస్తున్నారు. కొందరైతే వీకెండ్ వస్తే ట్రావెలింగ్ వ్లాగర్స్ వీడియోస్ చూసి వారికి నచ్చిన ప్లేసుకు వెళ్లివారికి ఫింగ్ చేస్తున్నారు.
ట్రావెలింగ్ మీద ఉన్న ఇంట్రెస్టుతో వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నామని వ్లాగర్స్ చెబుతున్నారు. హైదరాబాద్ అంటే స్పెషల్ ఫుడ్సే కాదని.. ఫేమస్ ప్లేసులు చాలా ఉన్నాయని..అందరికి తెలిసేలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని చెబుతున్నారు. 30 నుంచి 60 సెకన్స్ వీడియో కోసం డే మొత్తం స్పెండ్ చెసి ఫర్ఫెక్టు వీడియో తీసి అఫ్లోడ్ చేస్తామంటున్నారు. లొకెషన్ బట్టి మొబైల్ ఫోన్, కెమెరా, డ్రోన్ తో షూట్ చేస్తామని చెబుతున్నారు. వీడియోస్ వైరల్ అవుతున్నాయని.. లక్షల లైక్స్, వేల మంది ఫాలోవర్స్, వందల కామెంట్స్ వస్తున్నాయంటున్నారు.
హైదరాబాద్లో ట్రావెలింగ్ చేసేవారు చాలా తక్కువ మంది ఉండడంతో.. ఉన్న కొందరు బాగా వైరల్ అవుతున్నారు. కొందరు సరదాగా వ్లాగ్స్ చేస్తే.. మరికొందరు ఇదే ఫ్రొఫెషన్గా తీసుకుంటున్నారు.
