ఢిల్లీలో భూకంపం.. భయంతో జనాల ఉరుకులు

ఢిల్లీలో భూకంపం.. భయంతో జనాల ఉరుకులు

దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఈ రోజు ఉదయం 9.45 గంటల సమయంలో దాదాపు 30 సెకన్లపాటు బలమైన ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, తజికిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంప లోతు 181 కిలోమీటర్లుగా అధికారులు గుర్తించారు. ఆ ప్రభావంతోనే జమ్మూకశ్మీర్, నోయిడా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లు చెప్పింది. 

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో కనీసం 20 సెకన్ల పాటు భూమి కంపించిందని కొంతమంది నివాసితులు తెలిపారు. ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చాయని స్థానికులు అంటున్నారు. ‘నా తల తిరుగుతున్నట్లు అనిపించింది. వెంటనే ఫ్యాన్‌ని చూడగానే.. భూకంపం వచ్చిందని అర్ధమై కళ్ళు మూసుకున్నాను. నోయిడాలో దాదాపు 25 నుంచి 30 సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు సంభవించాయి’ అని ఢిల్లీకి సమీపంలోని శశాంక్ సింగ్ అనే వ్యక్తి అన్నారు.

For More News..

మాజీ ప్రధాని పీవీని ఓడించిన ఎంపీ జంగారెడ్డి మృతి