నిర్భయ దోషుల ఉరితీతకు ట్రయల్స్‌

నిర్భయ దోషుల ఉరితీతకు ట్రయల్స్‌

నిర్భయ దోషులకు ఢిల్లీలోని పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఉరి శిక్షను అమలు చేసేందుకు జైలు సిబ్బంది ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు తీహార్‌ జైలు అధికారులు తెలిపారు. ఇప్పటికే బీహార్ నుంచి ప్రత్యేకమైన ఉరి తాళ్లను తెప్పించారు. వాటితో తీహార్ జైల్లో ఉరితీత ట్రయల్ వేసి చూడాలని నిర్ణయించారు. దోషుల బరువుకు సమానమైన బరువున్న ఇసుక బస్తాలను ఆ తాళ్లకు కట్టి 1.8 మీటర్ల నుంచి 2.4 మీటర్ల ఎత్తులో వేలాడదీస్తారు. ఉరి కంబాల పటిష్టతను పరిశీలించడం కోసం ఇలా డమ్మీ ఉరి శిక్షను అమలు చేస్తారు. ఇందులో తాళ్లలో కానీ, ఉరికొయ్యలో కానీ ఏవైనా లోపాలుంటే బయటపడే అవకాశముంటుంది. తీహార్ ప్రాంగణంలోని మూడో నెంబరు జైల్లో ఈ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ ముందస్తు సన్నాహాల్లో జైలు సూపరింటిండెంట్ సహా అధికారులు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ అధికారులు పాల్గొంటారని తెలుస్తోంది.