భద్రాచలం ఐటీడీఏకు పెయింటింగ్స్ అందజేత

భద్రాచలం ఐటీడీఏకు పెయింటింగ్స్ అందజేత

కొణిజర్ల, వెలుగు: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని తనికెళ్ల తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ డిగ్రీ కళాశాలలో ఫైనల్​ ఇయర్​ చదువుతున్న విద్యార్థిని ఇర్పా స్వాతి వేసిన పెయింటింగ్స్ ను భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ కు మంగళవారం అందించారు. ఈ సందర్భంగా పీవో పెయింటింగ్స్​ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఫైన్ ఆర్ట్స్​లో ఉన్నత చదువు కోసం ఆర్థిక సాయం చేస్తానని అన్నారు. 

పెయింటింగ్స్​వేసేందుకు గతంలో స్వాతికి రూ.22,500 అందజేయగా, ప్రస్తుతం మరో రూ.7 వేలను ప్రోత్సాహకంగా అందజేశారు. కార్యక్రమంలో  ఆర్సీవో అరుణకుమారి, ప్రిన్సిపాల్ రజని, స్వాతి పాల్గొన్నారు.