
- దేశ వ్యాప్తంగా 16 చోట్ల సోదాలు
హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు చేస్తున్న ట్రైకలర్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 10చోట్ల సోదాలు జరగగా.. కంపెనీకి చెందిన హార్డ్ డిస్క్‌లు, ల్యాప్టాప్స్,లెక్కలో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 2010 నుంచి నిర్వహిస్తున్న వెంచర్స్, ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్స్, విదేశాల్లో ప్రాపర్టీ బిజినెస్, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించిన వివరాలు సేకరించినట్లు సమాచారం.ట్యాక్స్ చెల్లింపులో ట్రై కలర్స్ సంస్థ అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ సోదాలు జరిగాయి.