అంగన్వాడీలకు మూడుసార్లు జీతాలు పెంచాం

 అంగన్వాడీలకు మూడుసార్లు జీతాలు పెంచాం
  • అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు మూడుసార్లు జీతాలు పెంచిన ఏకైక ప్రభుత్వం మాదే
  • పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ జిల్లా: కరోనా మహమ్మారి ప్రబలి భయాందోళనకు గురిచేసిన తొలి రోజుల్లో ప్రాణాలు లెక్క చేయకుండా అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లు చేసిన సేవలు మరువలేనివని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ప్రజలకు అంగన్ వాడీలు చేస్తున్న సేవ  పుణ్యం మీ పిల్లలకు అందుతుందని ఆయన అన్నారు. ఆదివారం జనగామ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంగన్ వాడి టీచర్స్ మరియు హెల్పేర్స్ యూనియన్ జిల్లా మహాసభలు జరిగాయి. మహాసభల్లో  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి, టీఆర్ఎస్.కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, అంగన్ వాడి యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు భారతి తదితరులు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాడిన తర్వాత అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ లకు మూడు సార్లు జీతాలు పెంచిన ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అంగన్ వాడీ టీచర్లకు ఇప్పటీకీ ఏడు వేల రూపాయలే ఇస్తున్నారని ఆయన తెలిపారు. అంగన్ వాడీలకు త్వరలో కొత్త భవనాలు నిర్మించబోతున్నామని ఆయన వివరించారు.