టీఆర్ఎస్ అభ్యర్ధుల మెజారిటీకి కార్పోరేటర్లు కృషి చేయాలి: కేటీఆర్

టీఆర్ఎస్ అభ్యర్ధుల మెజారిటీకి కార్పోరేటర్లు కృషి చేయాలి: కేటీఆర్

పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి కార్పొరేటర్లు కృషి చేయాలని, ఇంటింటి తిరిగి ప్రచారం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని టీఆర్ఎస్ కార్పొరేటర్లతో సోమవారం ఆయన తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరిం చాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. ప్రతి కార్పొరేటర్ అభ్యర్థి గెలుపు కోసం గట్టిగా కృషి చేయాలన్నారు. ఎక్కువ మెజారిటీ సాధించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. చేవెళ్ల ,సికింద్రాబాద్, మల్కాజిగిరి స్థానాల్లో అభ్యర్థులు యువకులు కావడం పార్టీకి  ఖచ్చితంగా కలిసొస్తుందన్నారు.

ఎంపీ అభ్యర్థులతో పాటు స్థానిక ఎమ్మె ల్యేలతో పార్టీ ఎన్నికల ప్రచారాన్నిచేపట్టాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారి వారి డివిజన్లలో సాధిం చే మెజారిటీలను కార్పొరేటర్ల పనితీరుకు, ప్రజాదరణకు సూచికంగా భావిస్తామన్నారు. తమ తమ డివిజన్ పరిధిలోఉన్న రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, అపార్ట్మెంట్ కమిటీలను కలిసి ప్రచారం నిర్వహించాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టనున్నరోడ్డు షోల విజయవంతానికి కృషి చేయాలని కోరారు. పార్టీ ప్రచారానికి సంబంధించి మేయర్ బొంతు రామ్మోహన్ తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మె ల్సీ శ్రీనివాస్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, పార్టీ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్, సీనియర్ నాయకులు నవీన్ రావు, విప్లవ్ కుమార్ పాల్గొన్నారు.