నన్ను జైల్లో పెట్టినా.. బండి సంజయ్‌ బండారం బయటపెడతా

నన్ను జైల్లో పెట్టినా.. బండి సంజయ్‌ బండారం బయటపెడతా

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు . బండి సంజయ్ ని ఎంపీ పదవి నుండి దింపే వరకు ఉరుకోనన్నారు. పూర్తి ఆధారాలతో  ప్రెస్ మీట్ పెట్టి ఆయన బండరాం బయటపెడుతానన్నారు.  కరీంనగర్ నుండి బండి సంజయ్ మీద తమకు వందలాది కాల్స్ వస్తున్నాయన్నారు. తాను  భయపడే వ్యక్తిని కాదని...బయపడితే రాజకీయాల్లో ఉండలేనన్నారు.  తాను దళితులపై దాడి చేయలేదన్నారు. కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చూడాలన్నారు. బండి సంజయ్ తనను జైల్లో పెట్టినా..జైల్లో ఉండి కూడా తన  గురించి మాట్లాడుతానన్నారు. నువ్ ఒక చంప కొడితే నెను రెండు చెంపలు కొడతానన్నారు.  ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం అంటూ బండి సంజయ్ కు సవాల్ విసిరారు మైనంపల్లి.