టెట్‌పై సుప్రీంకోర్టులో టీఆర్‌టీఎఫ్ రివ్యూ పిటిషన్

టెట్‌పై సుప్రీంకోర్టులో టీఆర్‌టీఎఫ్ రివ్యూ పిటిషన్

హైదరాబాద్, వెలుగు:  సర్వీస్‌  టీచర్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి అంటూ ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించాలని కోరుతూ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్​టీఎఫ్​) శుక్రవారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.  

2017లో సవరించిన ఆర్టీఈ చట్టం 23(2) కారణంగానే ఈ పరిస్థితి  ఉత్పన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో సమీక్షించి సర్వీస్‌ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని రివ్యూ పిటిషన్‌లో సుప్రీంకోర్టును అభ్యర్థించినట్లు వారు పేర్కొన్నారు.