చైనా దోపిడీకి అడ్డుకట్ట వేశా: ట్రంప్

చైనా దోపిడీకి అడ్డుకట్ట వేశా: ట్రంప్

అమెరికా ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామన్నారు డొనాల్డ్ ట్రంప్. మన ఉద్యోగాలు కొల్లగొట్టడానికి చెక్ పెట్టామన్నారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ట్రంప్… మేధోసంపత్తి హక్కులను రక్షిస్తామన్నారు. డ్రగ్స్ దందా చేసే వారికి ముగింపు పలికే సమయం వచ్చిందన్నారు. గతంలో చాలా మంది ప్రతినిధులు సరిహద్దు గోడ నిర్మించాలన్నారని కానీ అది ఆచరణలోకి రాలేదన్నారు. ఇప్పుడు ఆ పనిని తాను చేసి చూపిస్తానన్నారు ట్రంప్.

మరోవైపు 250 బిలియన్ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై పన్నులు విధించామని, దీంతో అమెరికా ప్రభుత్వ ఖజానాకు బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోందన్నారు ట్రంప్. దీనికి చైనాను బ్లేమ్ చేయడం లేదని, గత అమెరికా నాయకుల విధానాలతోనే ఆదాయం కోల్పోయామన్నారు. చైనా దోపిడీకి అడ్డుకట్ట పడిందన్నారు. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ తో తన మైత్రీబంధం బాగుందన్నారు. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో వియత్నాంలో మళ్లీ సమావేశమవుతున్నానని వెల్లడించారు. ఇరాన్ లో అరాచకపాలన సాగుతోందని,  న్యూక్లియర్ డీల్ నుంచి తప్పిస్తున్నామన్నారు ట్రంప్. ఇరాన్ పై ఆంక్షలు కొనసాగుతాయన్నారు.