‘హెచ్ 1 బీ’పై బ్యాన్ మార్చి 31 దాకా
ఇతర వీసాలపై నిషేధాన్ని కూడా పొడిగించిన ట్రంప్
వాషింగ్టన్: హెచ్1బీ వీసాలపై బ్యాన్ ను అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మార్చి 31 దాకా పొడిగించారు. వీటితో ఇతర ఫారిన్ వర్క్ వీసాలు, గ్రీన్ కార్డులపై బ్యాన్ నూ ఎక్స్ టెండ్ చేశారు. అమెరికన్ వర్కర్ల ప్రయోజనాల కోసమే ఈ వీసాలపై నిషేధం అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. వర్క్ వీసాలపై ట్రంప్ ఇప్పటికే గతేడాది ఏప్రిల్ 22, జూన్ 22న రెండు సార్లు బ్యాన్‌ను పొడిగించారు. ఈ ఉత్తర్వుల గడువు డిసెంబర్ 31తో ముగిసిపోవడంతో మార్చి 31దాకా మరోసారి పొడిగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో 20 రోజుల్లో గద్దె దిగిపోనున్న ట్రంప్ ఎప్పటిలాగే దేశంలోకి ఇమిగ్రెంట్లను అడ్డుకునే చర్యలను కొనసాగించారు. అయితే, ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీలు దారుణంగా ఉన్నాయని, తాను అధికారంలోకి రాగానే హెచ్1బీ వీసాలపై సస్పెన్షన్‌ను ఎత్తేస్తానని జో బైడెన్ ఇంతకుముందే హామీ ఇచ్చారు. హెచ్1బీ వీసాల్లో అత్యధికంగా ఇండియన్ ఐటీ ఉద్యోగులే దక్కించుకుంటున్నారు. వీటిపై బ్యాన్ వల్ల ఇండియన్ టెకీలపై ఎఫెక్ట్ పడుతోంది.
టెర్రరిస్ట్ సంస్థలకు 460 కోట్ల ఫండ్స్ బ్లాక్
2019లో వివిధ దేశాల్లోని 70 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకు 63 మిలియన్ డాలర్ల(రూ.460 కోట్లు) నిధులు అందకుండా బ్లాక్ చేసినట్లు అమెరికా వెల్లడించింది. యూఎస్ ట్రెజరీ డిపార్ట్ మెంట్ ఈ మేరకు యాన్యువల్ రిపోర్ట్ విడుదల చేసింది. పాక్ నుంచి యాక్టివిటీస్ నిర్వహిస్తున్న లష్కరే తొయిబాకు 3.42 లక్షల డాలర్లను, జైషే మహ్మద్ కు 1725 డాలర్లను, హర్కతుల్ ముజాహిదీన్ కు 45,798 డాలర్లను, హిజ్బుల్ ముజాహిదీన్ కు 4321 డాలర్లను, తెహ్రీకే తాలిబన్ పాకిస్తాన్‌కు 5,067 డాలర్లను అందకుండా బ్లాక్ చేసినట్లు తెలిపింది. అత్యధికంగా అల్ కాయిదాకు 39లక్షల డాలర్లను బ్లాక్ చేసినట్లు పేర్కొంది. అలాగే హక్కానీ నెట్ వర్క్‌కు 26,546 డాలర్లను, ఎల్ టీటీఈకి 5.80 లక్షల డాలర్లను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. అయితే తాలిబాన్‌కు బ్లాక్ చేసిన ఫండ్స్ గణనీయంగా తగ్గాయి. ఈ సంస్థకు 2018లో 2.96 లక్షల డాలర్లను బ్లాక్ చేయగా, 2019లో 59 వేల డాలర్లు మాత్రమే బ్లాక్ అయ్యాయి. ఇక టెర్రరిజాన్ని స్పాన్సర్ చేస్తున్న ఇరాన్, సూడాన్, సిరియా, నార్త్ కొరియా దేశాలకు 2019లో 20 కోట్ల డాలర్ల ఫండ్స్ ను బ్లాక్ చేసినట్లు నివేదిక పేర్కొంది.
For More News..
స్నేహితుడి పెళ్లికి వెళ్లొస్తుండగా ఆక్సిడెంట్.. ఇద్దరు మృతి
ఆసీస్ టూర్‌కు వెళ్లగానే రోహిత్‌ను వరించిన ప్రమోషన్
డిసెంబర్‌లో జీఎస్‌టీ కలెక్షన్స్ టాప్..
సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
