ఇండో అమెరికన్స్‌కు కీలక పదవులు

ఇండో అమెరికన్స్‌కు కీలక పదవులు
  • ముగ్గురిని నామినేట్ చేసిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్

వాషింగ్టన్ : అమెరికాలో ఇండియన్ ఆరిజిన్ కు చెందిన ముగ్గురు ఇండో అమెరికన్లను కీలక పదవులు వరించనున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆయా పదవులను మన వారిని నామినేట్ చేశారు. ఇందులో కీలకమైన న్యూయార్క్ లోని ఫెడరల్ కోర్డు జడ్డి పదవి కూడా ఉండటం విశేషం. ఈ పదవికి ప్రముఖ లాయర్ సరితా కోమటి రెడ్డిని నామినేట్ చేయగా…ఇంటర్నేషనల్ రీ కన్ స్ట్రక్షన్ డెవలమెంట్ బ్యాంక్ కు అమెరికా ప్రతినిధిగా ఇండో అమెరికన్ లాయర్ అశోక్ మైఖేల్ పింటోను ప్రతిపాదించారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కో అపరేటివ్ డెవలప్ మెంట్ సంస్థకు తన రాయబారిగా ఇండో అమెరికన్ సీనియర్ దౌత్యవేత్త మనీషాసింగ్ ను నామినేట్ చేశారు. ఇప్పటికే ట్రంప్ టీమ్ లో చాలా మంది ఇండో అమెరికన్స్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జడ్జిగా నామినేట్ అయిన సరితా కోమటి రెడ్డి ప్రస్తుతం న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీస్ లో డిప్యూటీ చీఫ్ గా పనిచేస్తున్నారు.