వాళ్ల మాటలు వింటే..5 లక్షల మంది చనిపోయేవాళ్లు

వాళ్ల మాటలు వింటే..5 లక్షల మంది చనిపోయేవాళ్లు

వాషింగ్టన్: ‘డాక్టర్ ఫౌసీ, హెల్త్ ఎక్స్ పర్ట్స్ ఇడియట్స్, వాళ్ల  మాటలు విని ఉంటే 5 లక్షల మంది అమెరికన్లు చనిపోయేవాళ్లు’ అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. సోమవారం లాస్ వెగాస్ లో ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ‘కరోనా రిస్ట్రిక్షన్స్ వల్ల అమెరికన్లు విసిగిపోయారు. ఏమైనా జరగనీ మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి అని అంటున్నారు. డాక్టర్ ఫౌసీ, హెల్త్ ఎక్స్ పర్ట్స్ ఇడియట్స్. వాళ్ల మాటలు విని అమెరికన్లు అలసిపోయారు. డాక్టర్ ఫౌసీ ఓ డిజాస్టర్. ఇప్పటికైనా మంచి డెసిషన్స్ తీసుకోవాలి’ అని అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ డైరెక్టర్ ఆంథోనీ ఫౌసీ.. వైట్​హౌస్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్​కు చీఫ్ గా ఉన్నారు.  కరోనా విషయంలో మొదట్నుంచీ ఫౌసీ, ట్రంప్‌‌‌‌తో విభేదిస్తూనే ఉన్నారు. ట్రంప్‌‌‌‌ నిర్లక్ష్యం వల్లే అమెరికాలో 2 లక్షల మందికిపైగా మరణించారని ఆయన ఆరోపించారు. ఇది రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. మరోవైపు ట్రంప్ నిర్లక్ష్యంతో అమెరికన్ల ప్రాణాలు రిస్క్ లో పడ్డాయని ప్రత్యర్థి జో బిడెన్ ఆరోపించారు.

జో బిడెన్ తో డిబేట్ లో పాల్గొంటా: ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ తో డిబేట్​లో పాల్గొంటానని ట్రంప్ ప్రకటించారు. ఈ నెల 22న టెన్నెస్సీలోని బెల్మంట్ యూనివర్సిటీలో ప్రెసిడెన్షియల్ డిబేట్ కు రెడీగా ఉన్నట్టు చెప్పారు.