వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధం వేళ డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు ఆయుధాలు పంపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చైనాను హెచ్చరించారు. దాదాపు ఆరు వారాలుగా పశ్చిమాసియా భగ్గుమంటుంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేయడం.. కౌంటర్‌గా ఇరాన్ ప్రతిదాడులు చేయడంతో మిడిల్ ఈస్ట్ రణరంగంగా మారింది.
ఈ తరుణంలో తమ మిత్రదేశమైన ఇరాన్‌కు ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందిచేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ సంచలన కథనం ప్రచురించింది. త్వరలోనే ఆయుధాలు ఇరాన్ చేతికి అందే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, నేరుగా చైనా ఆయుధాలు అందించకుండా.. మీడియేటర్ ద్వారా ఈ టాస్క్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసినట్లు నివేదించింది.
మిడిల్ ఈస్ట్‌లో శాంతి కోసం అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతోన్న వేళ ఇరాన్‌కు చైనా ఆయుధాల సప్లై వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించిన ట్రంప్ చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిజంగానే ఇరాన్‌కు ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థ అందిస్తే చైనా పెద్ద సమస్యను ఎదుర్కొవాల్సి వస్తోందని బెదిరించారు.
నిరాధారమైన ఆరోపణలు: చైనా
ఇరాన్‌కు ఆయుధాలు అందించనున్నట్లు వస్తోన్న వార్తలను చైనా తీవ్రంగా ఖండించింది. అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేసింది. ఈ మేరకు వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పశ్చిమాసియా సంఘర్షణలో ఏ పక్షానికీ ఎన్నడూ చైనా ఆయుధాలు అందించలేదని క్లారిటీ ఇచ్చింది. నిరాధారమైన ఆరోపణలను నివారించాలని అమెరికాను కోరింది.
మే నెలలో ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ ఆరోపణలపై ప్రభావంతో ఆ పర్యటనపై ఏమైనా చూపిస్తుందో చూడాలీ. ఏదేమైనప్పటికీ ఇరాన్, అమెరికా మధ్య తాత్కలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి ఇరుదేశాల యుద్ధాన్ని పూర్తిగా ముగించేందుకు శాంతి చర్చలు జరుపుతోన్న వేళ టెహ్రాన్‌కు బీజింగ్ ఆయుధాలు అందిస్తే ఈ ఘర్షణ మరింత ముదిరే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
