శాసన సభ నిరవధిక వాయిదా

శాసన సభ నిరవధిక వాయిదా

శాసన సభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం అనంతరం సభను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు.  7 రోజుల పాటు సాగిన సమావేశాల్లో 56.25 గంటల పాటు సభ కొలువుదీరింది. ఈ నెల 3న గర్నవర్‌ తమిళిసై ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 6న ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, బిల్లులు, తీర్మానాలపై చర్చ సాగింది. సమావేశాలు చివరి రోజైన ఆదివారం ఆర్థికమంత్రి హరీశ్‌రావు ద్రవ్య వినియమ బిల్లును ప్రవేశపెట్టారు. సభలో మొత్తం 41 మంది సభ్యులు మాట్లాడగా.. 38 ప్రశ్నలకు మంత్రులు మౌఖికంగా సమాధానం ఇచ్చారు. ఈ సెషన్ లో 5 బిల్లులు ప్రవేశపెట్టగా చర్చ అనంతరం వాటికి సభ ఆమోదముద్ర వేసింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం సీఎం కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. అనంతరం స్పీకర్‌ పోచారం శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు.