టీఎస్ సెట్ పరీక్షా తేదీలు ఖరారు

టీఎస్ సెట్ పరీక్షా తేదీలు ఖరారు

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్) పరీక్షా తేదీలను ఉస్మానియా యూనివర్సిటీ ఖరారు చేసింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు లెక్చరర్లుగా పనిచేసేందుకు అర్హత కల్పించే ఈ పరీక్షను 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మార్చి 13,14,15వ తేదీల్లో ఎగ్జామ్ జరుగుతుందని చెప్పింది. టీఎస్ సెట్ కు అప్లై చేసుకున్న వారందరికీ త్వరలోనే ఎగ్జామ్ సెంటర్లు కేటాయిస్తామని అధికారులు ప్రకటించారు. 

టీఎస్ సెట్ ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 30 నుంచి ప్రారంభంకాగా ఈ నెల 20తో అప్లికేషన్ల గడువు ముగిసింది. అయితే అధికారులు దాన్ని 25వ తేదీ వరకు పొడగించారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు, ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్న వారు టీఎస్ సెట్ కు అప్లై చేసుకోవచ్చు.