కొత్త సచివాలయంలోకి విజిటర్స్ ను అనుమతించరా?

కొత్త సచివాలయంలోకి విజిటర్స్ ను  అనుమతించరా?

తెలంగాణ  కొత్త సెక్రటేరియేట్ ప్రారంభానికి సిద్ధమైంది. ఏప్రిల్ 30న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.  ఇప్పటి నుంచే  అన్ని శాఖలను కొత్త సచివాలయానికి షిప్ట్ చేస్తున్నారు అధికారులు.  అయితే కొత్త సచివాలయంలోకి సందర్శకులకు అనుమతించే  అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. విజిటింగ్ అవర్స్ తో పాటు  సెక్రటేరియట్ కు వచ్చే సందర్శకులను తగ్గించే యోచనలో   ఉన్నట్లు తెలుస్తోంది. ఈ  మేరకు   ప్రజా సమస్యలను చెప్పుకునేందుకు జిల్లాల వారీగా కలెక్టరేట్లతో పాటు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయంలో చెప్పుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు అధికారులు. 

ఇప్పటికే బీఆర్కే భవన్ నుంచి  పలు శాఖలను కొత్త సచివాలయానికి షిప్ట్ చేస్తున్నారు. కొత్త సచివాలయంలో  ఫ్లోర్ల వారీగా శాఖలను కేటాయించిన సంగతి తెలిసిందే..

  • గ్రౌండ్ ఫ్లోర్ .. ఎస్సీ, మైనార్టీ, లేబర్, రెవెన్యూ శాఖలు
  • 1వ అంతస్తు.. ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్, హోంశాఖ
  • 2వ అంతస్తు.. ఫైనాన్స్, హెల్త్, ఎనర్జీ, పశు సంవర్థక శాఖ
  • 3వ అంతస్తు.. ఇండస్ట్రియల్ అండ్ కామర్స్, ఎస్సీ డిపార్ట్మెంట్స్, ప్లానింగ్ డిపార్ట్ మెంట్
  • 4వ అంతస్తు.. బీసీ వెల్ఫేర్, ఫారెస్ట్, కల్చరల్ డిపార్ట్మెంట్, నీటి పారుదల శాఖ, లా డిపార్ట్ మెంట్
  • 5వ అంతస్తు.. టీఆర్ అండ్ బీ, GAD శాఖలు
  • 6 అంతస్తు.. సీఎం, సీఎస్ లకు కేటాయింపు