కార్మికుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్

కార్మికుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్

రాష్ట్రవ్యాప్తంగా కార్మికులకు హెల్త్ చెకప్ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కార్మికుల డేటా సేకరించిన కార్మిక శాఖ.. ఏ సంస్థ తో హెల్త్ ప్రొఫైల్ సేకరించాలని ఆలోచన చేస్తోంది. హెల్త్ చెకప్ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తే, ఒకటి, రెండు నెలల్లో కార్మికులకు ఆరోగ్య పరీక్షలు మొదలు కానున్నాయి.  ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13 లక్షల కార్మికులు రిజిష్టర్ అయ్యి ఉన్నారు. ఇందులో వేరే రాష్ట్రానికి చెందిన కార్మికులు లక్ష మంది దాకా ఉన్నారు. కార్మికుల్లో ఎక్కువ మంది భవన నిర్మాణ సంస్థలలో పని చేసే వారు ఉన్నారు. అలాగే సినిమా రంగం, హాస్పిటళ్లు, హోటళ్లలో చాలా మంది పనిచేస్తున్నారు. కార్మికుల సంక్షేమంపై ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వీరందరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని భావిస్తోంది.

కార్మికులు ఎక్కువ మంది పని చేసే చోట ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. కార్మికులకు దీర్ఘకాల వ్యాధులతో పాటు సీజనల్ వ్యాధుల చెకప్ చేయనుంది. దీర్ఘ కాలిక వ్యాధులున్నవారికి ESI తో పాటు ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం ఉన్న హాస్పిటళ్లలో చికిత్స అందించనుంది. కార్మికుల హెల్త్ చెకప్ పై రిపోర్టును కార్మిక శాఖ ప్రభుత్వానికి పంపింది. ఇది ఆమోదం పొందితే నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో కార్మికుల హెల్త్ చెకప్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. హెల్త్ చెకప్ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆరోగ్య భద్రత కల్పించినట్టు అవుతుందంటున్నారు.