28 నుంచి టీఎస్‌ ఐసెట్ కౌన్సెలింగ్

28 నుంచి టీఎస్‌ ఐసెట్ కౌన్సెలింగ్

TS ICET-2021 ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈనెల 28 నుంచి దీనికి సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. ఈనెల 28,29న సర్టిఫికెట్ల  పరిశీలనకు స్లాట్‌ బుకింగ్స్‌ చేసుకోవాలి. 29న సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు.

ఈ రెండు రోజుల్లోనే వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం కల్పించారు అధికారులు. ఈనెల 30న ఎంబీఏ, ఎంసీఏ ప్రత్యేక విడత సీట్లను కేటాయించనున్నారు. అదే రోజు స్పాట్‌ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.