హైదరాబాద్, వెలుగు: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల ప్రక్రియ అంతా పూర్తయింది. ఈ నెల29 లేదా 30వ తేదీన ఫలితాలను విడుదల చేసేందుకు ఎస్ఎస్‌సీ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, రిజల్ట్స్ డేట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు బుధవారం ఫలితాలు వచ్చే చాన్స్ ఉంది.
అది సాధ్యం కాకపోతే గురువారం రిలీజ్ చేయనున్నారు. కాగా, ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరిగాయి. ఈ ఏడాది మొత్తం 5.28 మంది విద్యార్థులు పరీక్షలకు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 5.17 లక్షల మంది ఉండగా, 10 వేల మందికి పైగా సప్లిమెంటరీ విద్యార్థులు ఉన్నారు. ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా రిలీజ్ చేయనున్నారు.

