
బషీర్‌బాగ్, వెలుగు : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ‘బెస్ట్ న్యూస్ ఫొటో కాంటెస్ట్ – 2025’లో పాల్గొనేందుకు ఫొటో జర్నలిస్టుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఫొటో జర్నలిస్టుల సంఘం (టీఎస్‌పీజేఏ) రాష్ట్ర అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.నరహరి బుధవారం ప్రకటించారు. కాంటెస్ట్‌లో పాల్గొనాలనుకునే వారు మూడు 8/12 సైజ్ కలర్ లేదా బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను బషీర్‌బాగ్ టీయూడబ్ల్యూజే బిల్డింగ్‌లోని టీఎస్‌పీజేఏ ఆఫీస్‌కు ఆగస్ట్ 10లోగా పంపించాలని సూచించారు.
ఆగస్ట్ 19న హైదరాబాద్‌లో ద్లో త్తమ ఫొటోల ప్రదర్శన ఉంటుందన్నారు. పోటీలో గెలిచిన వారికి ఫస్ట్ప్రైజ్ కింద రూ.10 వేలు, సెకండ్ ప్రైజ్ కింద రూ.7 వేలు, థర్డ్ప్రైజ్ కింద రూ. 5 వేలతో పాటు 10 మందికి రూ. 2 వేల చొప్పున కన్సోలేషన్ బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.