
హైదరాబాద్, వెలుగు : గ్రూప్ 2 ఎగ్జామ్స్‌ను వచ్చే నెల 6, 7వ తేదీల్లో నిర్వహించనున్నందున, ఆ రెండు రోజులు అన్ని విద్యాలయాలకు సెలవులు ఇవ్వాలని కలెక్టర్లను టీఎస్‌పీఎస్సీ కోరింది. ఈ మేరకు సోమవారం కలెక్టర్లకు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ లేఖ రాశారు. అలాగే, ఎగ్జామినేషన్ సెంటర్ల గుర్తింపు, సౌకర్యాలపై సమీక్ష జరిపి టీఎస్‌పీఎస్సీకి వివరాలు అందజేయాలని ఆమె సూచించారు. సెంటర్ల ఎంపికలో సీసీ కెమెరాలు ఉన్న స్కూళ్లు, కాలేజీలకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.