టీఎస్ పీఎస్ సీ(TSPSC) పేపర్ లీక్ వివాదంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ పీఎస్ సీలో కొత్త పోస్టులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. టీఎస్పీఎస్ సీ ప్రతిపాదించిన 10 కొత్త పోస్టులకు అనుమతిచ్చింది ప్రభుత్వం. టీఎస్ పీఎస్ సీ కంట్రోలర్ అండ్ ఎగ్జామినేషన్ పేరుతో కీలక పోస్టు మంజూరు చేసింది ప్రభుత్వం. దీనికి ఛైర్మన్ గా ఐఏఎస్ అధికారి బీఎం. సంతోష్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ శాఖలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ బాధ్యతలను నుంచి ఆయనను బదిలీ చేసింది.
అయితే ఇన్ని వివాదాలు వచ్చినా టీఎస్ పీఎస్ సీ బోర్డులో ఎలాంటి మార్పులు చేయలేదు సర్కార్. బోర్డు ప్రక్షాళన చేయకుండానే రద్దయిన ఎగ్జామ్ డేట్లను హడావుడిగా ప్రకటించి విమర్శలు ఎదుర్కొంటుంది. సంస్థలోని ఉద్యోగులే అవకతవకలకు పాల్పడినా చర్యలు తీసుకోకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
