ఆర్టీసీ యూనియన్లు మళ్లీ యాక్టివ్!

ఆర్టీసీ యూనియన్లు మళ్లీ యాక్టివ్!

8 నెలలుగా సైలెంట్‌‌గా ఉన్న కార్మిక సంఘాలు
మేనేజ్మెంట్‌‌పై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత
సమస్యలపై పోరాటానికి రెడీ అవుతున్న యూనియన్లు

హైదరాబాద్‌‌, వెలుగు: ఆర్టీసీలో యూనియన్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇటీవల టీఆర్ఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం పేరుతో కొత్త యూనియన్ పుట్టుకొచ్చింది. మరోవైపు తెలంగాణ మజ్దూర్‌‌ యూనియన్(టీఎంయూ)లో నాయకత్వ మార్పు జరగనున్నట్లు తెలిసింది. ఆ యూనియన్‌ ‌కూడా
మళ్లీ యాక్టివ్ కావాలని పావులు కదుపుతోంది. మేనేజ్‌‌మెంట్‌‌పై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో సమస్యలపై పోరుబాట పట్టేందుకు యూనియన్లు సిద్ధమవుతున్నాయి.

సమ్మె తర్వాత నో యూనియన్లు
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గతేడాది 55 రోజులపాటు ఆర్మీసీ ఉద్యోగులు సమ్మెచేశారు. దీంతో ఆగ్రహించిన సీఎం.. ఆర్టీసీలో యూనియన్లు ఉండొద్దని ఆదేశించారు. యూనియన్లకు ఉండే అన్ని హక్కులు రద్దు చేశారు. గుర్తింపు యూనియన్‌ ‌టీఎంయూ కార్యాలయానికి తాళంవేశారు. 30 మంది నేతల ఓడీలు రద్దు చేశారు. అనేక మందిని ట్రాన్స్‌‌ఫర్‌‌ చేశారు. వివిధ రకాలుగా ఇబ్బందులు పెట్టారు. దీంతో నేతలు సైతం వెనక్కి తగ్గారు. ఒకానొక సమయంలో ఆర్టీసీ సమస్యలపై మాట్లాడేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఉద్యోగులు ఇబ్బందులు పడినా, అధికారులు వేధించినా పట్టించుకోలేదు.

టీఎంయూలో నాయకత్వ మార్పు..
సమ్మె తర్వాత సైలెంట్‌‌ గా ఉన్న టీఎంయూ యాక్టివ్‌‌ కావాలని భావిస్తోంది. యూనియన్‌‌ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి సైలెంట్‌‌ గా ఉండటంతో నాయకులు, ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆయన స్వచ్ఛందంగా తప్పుకుని, మరొకరికి అప్పజెప్పాలని చూస్తున్నారని సంఘ నేతలు చెబుతున్నారు. ఆయనను పక్కనబెట్టి మళ్లీ సర్కారుకు దగ్గర అవ్వాలని టీఎంయూ నేతలు భావిస్తున్నారు. ఒక్కరిద్దరు మంత్రులతో సీఎంను కలిసేందుకూ ప్రయత్నిస్తున్నారు. టీఎంయూ ఉండగా కొత్తగా సంఘం ఎందుకని వివరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

సమస్యలపై పోరుబాట
ఆర్టీసీ మేనేజ్‌‌మెంట్‌‌పై ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. యూనియన్లు లేకపోవడం, వెల్ఫేర్‌‌కౌన్సిళ్లు సరిగా పనిచేయకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో యూనియన్లు రంగంలోకి దిగాలని భావిస్తున్నాయి. అందులో భాగంగానే టీఎంయూలో నాయకత్వ మార్పు అని నేతలు పేర్కొంటున్నారు. ఆర్టీసీలో ఒక యూనియన్‌‌ బయటకు వస్తే, ఇతర యూనియన్లు కూడా అదే దారిలో వెళ్తాయని చెబుతున్నారు. ఆర్టీసీని రక్షించడం, ఉద్యోగులను కాపాడుకోవడమే తమ లక్ష్యమని ఓ యూనియన్‌‌ కీలక నేతలు చెప్పారు.

కొత్తగా టీఆర్‌‌ఎస్‌‌ సంఘం ఏర్పాటు
గతంలో ఆర్టీసీలో టీఆర్ఎస్‌‌ యూనియన్‌‌గా టీఎంయూ చెలామణీ అయ్యింది. ప్రస్తుతం టీఎంయూ యాక్టివ్‌‌గా లేదు. దానిపై ప్రభుత్వానికి మంచి ఒపీనియన్లేదు. దీంతో ఇటీవల టీఆర్‌‌ఎస్‌‌ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం పేరుతో నల్గొండలో ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సభ నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి గెస్ట్‌‌ హౌస్లో జరిగింది.యూనియన్లు వద్దని సీఎం చెప్పి, ఇప్పుడు కొత్తగా ఆపార్టీ పేరుతోనే సంఘం ఏర్పాటు చేయడంపై పెద్దచర్చే నడుస్తోంది.

For More News..

ధోనీ కోసం ఫేర్వెల్ మ్యాచ్!

ఏడాది లీజుకు ఎలక్ట్రిక్ బైక్

హైదరాబాద్‌ లో తొలిసారిగా.. టై గ్లోబల్ సమ్మిట్ 2020

తెలంగాణలో కొత్తగా 1,724 కరోనా కేసులు