టీఆర్ఎస్ పార్టీ ధనికులకు టికెట్లు అమ్ముకుంది: ఎల్. రమణ

టీఆర్ఎస్ పార్టీ ధనికులకు టికెట్లు అమ్ముకుంది: ఎల్. రమణ

హైదరాబాద్ లోని టీడిపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి టీడిపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ.. 37 ఏండ్ల కింద 37 మందితో టీడీపీ ఆవిర్భావం అయిందని అన్నారు.  ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అహంకార పూరిత పాలన జరుగుతుందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ధనికులకు టికెట్లు అమ్ముకుందని రమణ ఈ సందర్భంగా ఆరోపించారు. మళ్ళీ సచివాలయ పాలన రావాలి అంటే…పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి బుద్ది చెప్పాలన్నారు. నిజామాబాద్ లో రైతుల నామినేషన్ పై స్పందిస్తూ.. కవిత పై రైతుల సాహసానికి టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదురుకునేందుకు యువత, నిరుద్యోగులు ముందుకు రావాలి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు రమణ తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో టీడిపీ బలోపేతానికి కార్యాచరణ పెట్టుకొని ముందుకు వెళదామని కార్యకర్తలకు ఆయన సూచించారు.