సోనాక్షి సిన్హా లీడ్ రోల్లో నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘తూ హై మేరీ కిరణ్’. ఆమె భర్త జహీర్ ఇక్బాల్ ఇందులో నెగటివ్ క్యారెక్టర్లో నటించాడు. కరణ్ రావల్ దర్శకత్వం వహించగా విశాల్ రానా నిర్మించారు. కిరణ్ అనే పాత్రలో సోనాక్షి, సమర్గా జహీర్ నటించారు. కిరణ్‌తో పరిచయాన్ని ప్రేమగా అపోహపడ్డ సమర్ లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఆమె రిజెక్ట్ చేయడంతో సైకోలా మారి తనను ప్రేమించాల్సిందేనని వెంటపడి వేదిస్తుంటాడు.
అతని వేధింపుల వల్ల ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది, ఎలా బయటపడింది అనేది మిగతా కథ. లవ్, అబ్సెషన్, పొసెసివ్‌నెస్ నేపథ్యంలో రూపొందిస్తున్నారు. సోనాక్షి రియల్ లైఫ్ భర్త ఇందులో తనకు సైకో లవర్‌గా నటించడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఏడేళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత 2024లో సోనాక్షి, జహీర్ వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు ‘డబుల్ ఎక్స్ఎల్’ అనే చిత్రంలో కలిసి నటించిన ఈ జంట, పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న సినిమా ఇది. అక్టోబర్ 23న థియేటర్స్‌లో విడుదల కానుంది.
