రూట్ క్లియర్..! : తుమ్మలతో రేవంత్ రెడ్డి భేటీ

రూట్ క్లియర్..! :  తుమ్మలతో రేవంత్ రెడ్డి భేటీ

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో  టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తుమ్మలను.. రేవంత్ పార్టీలోకి అహ్వానించారు. బీఆర్ఎస్ నుంచి  పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల..కాంగ్రెస్ లోకి వెళ్తరంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో వీరి భేటీ ఆసకక్తికరంగా మారింది. ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు సుదర్శన్ రెడ్డి, మల్లు రవి ఇతర నేతలు ఉన్నారు. తుమ్మల కాంగ్రెస్ లోకి ఎప్పుడు వెళ్తారన్నది క్లారిటీ రావాల్సి ఉంది.  

తాను పాలేరు నుంచే పోటీ చేస్తానని తుమ్మల చెబుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ లిస్ట్​ ప్రకటించిన తర్వాత కూడా ఆయన అదే మాటపై ఉన్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరితే ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ ముఖ్య నేతలు ఆయనకు సూచించనున్నట్టు తెలుస్తున్నది. పాలేరు నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో పాలేరు నుంచి పోటీకి పొంగులేటి సిద్ధంగా ఉన్నా, తుమ్మల మాత్రం ఖమ్మం నుంచి పోటీకి రెడీగా లేరని అంటున్నారు. మరోవైపు వైఎస్ఆర్​టీపీ కాంగ్రెస్‌లో విలీనమైతే షర్మిల కూడా పాలేరు సీటు కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. అందుకే తుమ్మలకు ఖమ్మం సీటు ఆఫర్​ చేయడానికి కారణమన్న చర్చ నడుస్తున్నది.