ఐపీఎల్ స్టార్ బౌలర్ పెళ్లి..పిక్స్ వైరల్

ఐపీఎల్ స్టార్ బౌలర్ పెళ్లి..పిక్స్ వైరల్

2023 లో పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్ల లిస్ట్ పెరిగిపోతుంది. ఈ ఏడాది చాలా మంది మన క్రికెటర్లు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, లెఫ్టర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్, రంజీ కింగ్ సర్ఫరాజ్ ఖాన్,ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ ఈ లిస్టులో ఉన్నారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్  బౌలర్ తుషార్ దేశ్ పాండే వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. 

ముంబయిలో తన చిన్ననాటి స్నేహితురాలు నభా గడ్డంవర్‌తో దేశ్ పాండే వివాహం జరిగింది. చిన్నప్పుడు వీరిద్దరూ ఒకే స్కూల్ లో చదువుకోవడం విశేషం. వీరి స్నేహం ప్రేమగా మారి పెద్దలను అంగీకారంతో వివాహం చేసుకున్నారు. జూన్ నెలలో వీరి వివాహం జరగగా.. తాజాగా మరాఠి సంప్రదాయంలో వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన పిక్స్ ఈ సూపర్ కింగ్స్ బౌలర్ ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ‘ఎక్స్చేంజ్ హార్ట్స్ ఇన్ ఫర్ ఎ న్యూ స్టార్ట్’ అంటూ పిక్స్ పోస్టు చేశాడు. ఈ ఫోటోలు సోసిల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

చెన్నై సూపర్ కింగ్స్ ఇంస్టాలో ఈ కపుల్స్ కు అభినందనలు తెలిపింది.  ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరపున తుషార్ దేశ్‌పాండే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ముంబైకి చెందిన తుషార్ దేశ్ పాండే ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. ఈ ఏడాది(2023) చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన ఈ యువ బౌలర్ అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్‌లో 16 మ్యాచుల్లో 21 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన చెన్నై బౌలర్ గా నిలిచాడు.