టీఆర్పీ రేటింగ్ కోసం ఇంటికి రూ.500 ఇస్తున్న టీవీ చానల్

టీఆర్పీ రేటింగ్ కోసం ఇంటికి రూ.500 ఇస్తున్న టీవీ చానల్

ముంబైలో యాడ్స్ కోసం రేటింగ్స్ రిగ్గింగ్

రిపబ్లిక్ టీవీతోపాటు మూడు చానెళ్లపై పోలీసుల ఆరోపణలు

ఎంతటివారైనా వదిలేది లేదన్న ముంబై పోలీస్ చీఫ్

సారీ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తానన్న ఆర్నాబ్ గోస్వామి

ముంబై: రిపబ్లిక్ టీవీతోపాటు మూడు టీవీ చానెళ్లు టీఆర్పీ రేటింగ్ ను తారుమారు చేస్తున్నట్టు ముంబై పోలీసులు ఆరోపించారు. రేటింగ్ ఫ్రాడ్ కు సంబంధించి రెండు టీవీ చానెళ్ల ఓనర్లను అరెస్టు చేశామన్నారు. రిపబ్లిక్ టీవీ డైరెక్టర్లు, ప్రమోటర్లను విచారిస్తామని, ఒకట్రెండు రోజుల్లో సమన్లు జారీ చేస్తామని తెలిపారు. టీఆర్పీ స్కామ్ సంబంధించి గురువారం ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. రేటింగ్స్ రిగ్గింగ్ చేసి అడ్వర్టైజ్ మెంట్ల ద్వారా డబ్బులు సంపాదించినట్లు తేలితే రిపబ్లిక్ టీవీ ఇతరుల అకౌంట్లను ఫ్రీజ్ చేస్తామని చెప్పారు. రేటింగ్స్ మ్యానిప్యులేషన్ కోసం న్యూస్ చానెళ్లు ఇళ్ల డేటాను వాడాయని, అక్రమంగా అడ్వర్టైజ్ మెంట్ ఫండ్స్ పొందాయని, .దీన్ని చీటింగ్ గా పరిగణిస్తున్నట్లు ఆయన చెప్పారు. తప్పుడు టీఆర్పీ వ్యాప్తి జరుగుతోందని, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కోసమే ఈ మ్యానిపులేషన్ జరుగుతున్నట్టు తెలిపారు. ఒకే చానల్‌‌ను ఫిక్స్ డ్ గా పెట్టి దాన్నే చూసేందుకు ప్రతి ఇంటికి నెలకు రూ.400 నుంచి 500 వరకు ఇస్తున్నారని అన్నారు. చదువు రానివారి ఇండ్లల్లోనూ నిరంతరం ఇంగ్లిష్ న్యూస్ చానెళ్లు పెట్టేందుకు డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు. ‘ఫక్త్ మరాఠీ, బాక్స్ సినిమా చానళ్ల ఓనర్లను అరెస్టు చేశాం. చానళ్ల బ్యాంకు అకౌంట్లను  పరిశీలిస్తాం. ఇందులో పాత్ర ఉందని తేలితే ఎంతటి పెద్దవారైనా, ఎంత సీనియర్ అయినా వదిలేది లేదు. ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తాం’ అని పరమ్ వీర్ సింగ్ అన్నారు. ముంబైలో 2 వేల బారోమీటర్లు పెట్టారని, వీటిని హన్స అనే సంస్థ మానిటర్ చేస్తోందని,  ఆ సంస్థ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు తెలిపారు.

ముంబై పోలీస్ కమిషనర్ పై కోర్టుకెళ్తా: ఆర్నాబ్

తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ముంబై పోలీస్ కమిషనర్ పై కోర్టుకెళ్తానని రిపబ్లిక్ టీవీ చీఫ్​ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామి అన్నారు. సుశాంత్ కేసులో ప్రశ్నించినందుకే తమపై ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే పరువు నష్టం దావా వేస్తామన్నారు.

For More News..

రేపటి నుంచి ధరణిపై ట్రైనింగ్

ఆస్తుల ఆన్​లైన్‌లో​ సర్వర్​ డౌన్​.. ఆసక్తి చూపని ఓనర్లు

మనీ రిక్వెస్ట్‌లు పెడుతూ పైసల్ వసూల్.. ఒక్కో సిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 50 మంది టార్గెట్

వీడియో: కేబుల్ బ్రిడ్జిపై షర్ట్ విప్పి సెల్ఫీలు.. అరెస్ట్ చేసిన పోలీసులు