నాడు ఎంజీఆర్‌‌‌‌‌‌‌‌, ఎన్టీఆర్.. నేడు విజయ్..పార్టీ పెట్టిన కొద్దిరోజులకే తిరుగులేని విజయం

నాడు ఎంజీఆర్‌‌‌‌‌‌‌‌, ఎన్టీఆర్.. నేడు విజయ్..పార్టీ పెట్టిన  కొద్దిరోజులకే తిరుగులేని విజయం
  • రాజకీయ గ్లామర్‌‌‌‌‌‌‌‌తో పార్టీ పెట్టిన 
  • కొద్దిరోజులకే తిరుగులేని విజయం

చెన్నై: సినీ గ్లామర్‌‌‌‌కు, రాజకీయ పీఠానికి విడదీయలేని బంధం ఉన్న తమిళనాడులో నటుడు విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ పార్టీ 108 స్థానాల్లో ఆధిక్యం సాధించి, కేవలం 118 సీట్ల మెజారిటీ మార్కుకు చేరువలో ఉండటం ద్రావిడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే, గత చరిత్రను పరిశీలిస్తే సినీ తారల రాజకీయ అరంగేట్రం ఎప్పుడూ పూలబాట కాలేదు. ఎంజీఆర్ నుంచి ఎన్టీఆర్ వరకు కొందరు చరిత్ర సృష్టిస్తే, మరికొందరు చతికిలపడ్డారు. తమిళనాడు రాజకీయాల్లో అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలితలాంటి వారు సినీ రంగం నుంచి వచ్చి అప్రతిహత విజయాలు సాధించారు. కానీ అందరికీ అది సాధ్యం కాలేదు. కెప్టెన్ విజయకాంత్ (డీఎండీకే) 2006లో ‘డిస్ట్రప్టర్’గా ఎంట్రీ ఇచ్చి 232 సీట్లలో పోటీ చేస్తే, ఆయన ఒక్కరు మాత్రమే గెలిచారు. 2011లో పుంజుకున్నా, ఆ తర్వాత క్రమంగా ప్రాభవం కోల్పోయి ఇప్పుడు డీఎంకేతో జూనియర్ పార్టనర్‌‌‌‌గా మిగిలిపోయారు. 

ఇక మరో హీరో కమలాసన్‌‌‌‌ 2018లో మక్కల్‌‌‌‌ నీది మయ్యం (ఎంఎన్‌‌‌‌ఎం) పార్టీ పెట్టి..2021 ఎన్నికల్లో 180 చోట్ల పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీకి దూరంగా ఉంటూ డీఎంకేకు మద్దతు ప్రకటించింది.1958లో ప్రారంభమైన ‘నామ్ తమిళర్ కచ్చి’ (ఎన్‌‌‌‌టీకే)ని సీమాన్ పునరుద్ధరించారు. ఆరంభంలో ఓట్ల శాతం తక్కువగా ఉన్నా, ప్రస్తుతం రాష్ట్రంలో తన ఉనికిని చాటుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి, పవన్‌‌‌‌కల్యాణ్​ పార్టీలు పెట్టినా సీఎం కాలేకపోయారు. కాగా, ఒకప్పుడు తెలుగునాట ఎన్టీఆర్ సృష్టించిన రాజకీయ సుడిగాలిని తలపిస్తున్న విజయ్ అరంగేట్రం, ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమిళనాడులో దినతంతి వ్యవస్థాపకుడు ఆదిత్యనార్ నుంచి సీమాన్ వరకు ఎందరో ప్రయత్నించినప్పటికీ, విజయ్ తనకున్న అశేష అభిమాన గణాన్ని ఒక క్రమశిక్షణ కలిగిన ఓటు బ్యాంకుగా మార్చడంలో విజయవంతమయ్యారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.