ఎట్టకేలకు దిగొచ్చిన ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌..

ఎట్టకేలకు దిగొచ్చిన ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌..

న్యూఢిల్లీ: ఎట్టకేలకు ట్విట్టర్‌‌‌‌‌‌‌‌ దిగొచ్చింది. కొత్త ఐటీ రూల్స్‌‌‌‌ను అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మన దేశానికి చెందిన వినయ్‌‌‌‌ ప్రకాశ్‌‌‌‌ను రెసిడెంట్‌‌‌‌ గ్రీవెన్స్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌(ఆర్‌‌‌‌‌‌‌‌జీవో)గా నియమించింది. ఈమేరకు సంస్థ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో వివరాలు వెల్లడించింది. ఈ‌‌‌‌‌‌‌‌–మెయిల్‌‌‌‌ ద్వారా వినియోగదారులు ఫిర్యాదులు పంపవచ్చని చెబుతూ ఐడీ వివరాలు వెల్లడించింది. కొన్ని రోజులుగా ట్విట్టర్‌‌‌‌‌‌‌‌కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఐటీ రూల్స్‌‌‌‌ అమలుపై వివాదం నడుస్తోంది. కొత్త ఐటీ రూల్స్​ను కచ్చితంగా అమలుచేయాలని ఢిల్లీ హైకోర్టు ట్విట్టర్‌‌‌‌ను పలుమార్లు హెచ్చరించింది. ఇండియాకు చెందిన వారినే ఆఫీసర్లుగా నియమించాలని, ఇందుకు గడువు ఇచ్చింది. అయినా అమలుచేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. గతంలో ఆర్‌‌‌‌‌‌‌‌జీవోగా ధర్మేంద్ర చతూర్‌‌‌‌‌‌‌‌ను ట్విట్టర్‌‌‌‌‌‌‌‌ నియమించగా, ఆయన రాజీనామా చేయడంతో మరికొంత సమయం కావాలని కోరింది.