మాదాపూర్ హోటల్ లో పేలిన గ్యాస్ సిలిండర్లు

మాదాపూర్ హోటల్ లో పేలిన గ్యాస్ సిలిండర్లు

మాదాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  సాయి నగర్ కాలనీలోని హోటల్లో  రెండు సిలిండర్లు పేలాయి.  మంటలు వ్యాపించడంతో  హోటల్ పూర్తిగా దగ్ధం అయ్యింది.  ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పుతున్నాయి.  పొగ కమ్మేయడంతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకదాని వెంట ఒకటి వరుసగా రెండు సిలిండర్లు పేలాయి. 

 ఎవరికి ఎలాంటి ప్రమాదం కాలేదని పోలీసులు చెబుతున్నారు.  ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.  భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింద‌ని హోట‌ల్ నిర్వాహ‌కులు  చెబుతున్నారు. 

గ్యాస్ సిలిండర్ల పేలుళ్లలో హోటల్ బాగా దెబ్బతిన్నది. ఈ రహదారిలో ట్రాఫిక్ జాం అయ్యింది. రెస్క్యూ ఆపరేషన్ కారణంగా.. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ప్రమాదానికి కారణాలపై విచారణ చేస్తున్నారు అధికారులు. ఒకేసారి రెండు గ్యాస్ సిలిండర్లు ఎలా పేలాయి అనే విషయాలపై హోటల్ సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తున్నారు.