హైదరాబాద్ : పాతబస్తీ చాంద్రాయణగుట్టలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రోమన్ హోటల్ ఎదురుగా ఫ్లై ఓవర్ కింద పార్కు చేసిన ఆటోలు ఇద్దరు యువకులు డెడ్బాడీలు కనిపించడం కలకలం రేపింది.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను మహంగీర్ (24), ఇర్ఫాన్ (25)గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీలను ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ సాయం తో ఆధారాలు సేకరించారు. అక్కడ మూడు సిరంజీలు లభించాయి. దీంతో అధిక మోతాదులోడ్రగ్స్ తీసుకోవడంతోనే వారు చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరో వ్యక్తి పరారైనట్లు సమాచారం. ఈ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
