అమెరికాలో కాల్పు లుఇద్దరు మృతి.. మరో ముగ్గురికి గాయాలు

అమెరికాలో కాల్పు లుఇద్దరు మృతి.. మరో ముగ్గురికి గాయాలు

లాస్ వేగాస్: అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. లాస్ వేగాస్ లోని అథ్లెటిక్ క్లబ్ లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు ఒక ప్రకటన జారీ చేశారు. ఒక అనుమానాస్పద వ్యక్తి తుపాకీతో బయటకు పరిగెత్తడంతో కాల్చి వేశామని తెలిపారు. అతడు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని చెప్పారు.

 గాయాలపాలైన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించామని పేర్కొన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. ప్రజలకు ఇకపై ఎటువంటి ముప్పు లేదని వెల్లడించారు. కాల్పులకు గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.