
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి మెడికల్‌బోర్డులో అక్రమాలు, అవినీతిపై ఇద్దరు ఉద్యోగులను సింగరేణి విజిలెన్స్ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మెడికల్ బోర్డు, ట్రాన్స్ఫర్స్, ఇతర పైరవీల పేరుతో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారంటూ కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్వర్క్షాపులో పని చేస్తున్న డ్రైవర్ రాజేశ్వర్‌రావును వారం రోజుల కింద ఏసీబీ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపింది.
కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ ఆస్పత్రి వార్డు బాయ్‌తో పాటు సింగరేణి సెంట్రల్ వర్క్‌షాపులో మరో వ్యక్తిని సింగరేణి విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మెడికల్‌బోర్డు దందాలో భాగంగానే వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది.