చండ్రుగొండ, వెలుగు : వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని గానుగపాడు గ్రామంలో గురువారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పనితి వెంకటేశ్వర్లు (58) బుధవారం తన ఇంటి చుట్టూ కంచె వేసే పనులు చేశాడు.
ఈ క్రమంలో ఎండ తీవ్రత కారణంగా సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఇంట్లోకి తీసుకొచ్చారు. అర్థరాత్రి టైంలో వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతుండడంతో కుటుంబసభ్యులు 108లో కొత్తగూడెం ఏరియా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ గురువారం చనిపోయాడు.
మంధనిలో ఫొటోగ్రాఫర్...
మంథని, వెలుగు : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన శ్రీరామ ఫొటో స్టూడియో యజమాని గంధం నగేశ్ (55) గురువారం వడదెబ్బతో చనిపోయారు. గురువారం బైక్‌పై ముత్తారం మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి వెళ్లిన నగేశ్.. అక్కడ ఓ కార్యక్రమానికి ఫొటోలు తీసిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు మంథని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు
డాక్టర్లు చెప్పారు.

