128 పీడీ, 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు

128 పీడీ, 148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు

హైదరాబాద్, వెలుగు: టీఎస్‌పీఎస్సీ మరో రెండు నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. వివిధ కాలేజీల్లో 128 ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టులతో పాటు 148 అగ్రికల్చర్ పోస్టుల భర్తీకి బుధవారం వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చింది. పీడీ పోస్టుల్లో ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌లో 91, టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో 37 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు జనవరి 6 వ తేదీ నుంచి 27 సాయంత్రం 5 గంటలదాకా అప్లై చేసుకోవాలని కమిషన్ అధికారులు సూచించారు.

148 అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు జనవరి 10 నుంచి 30 వరకు అప్లయ్‌ చేసుకోవాలని కోరారు. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల్లో మల్టీజోన్ 1 పరిధిలో వంద, మల్టీజోన్ 2 పరిధిలో 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ చూడాలన్నరు.