అయ్యోపాపం.. స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి.. యాదాద్రి జిల్లాలో ఘటన

అయ్యోపాపం..  స్కూల్ బస్సు కింద  పడి చిన్నారి మృతి.. యాదాద్రి జిల్లాలో ఘటన

యాదాద్రి, వెలుగు: స్కూల్‌‌‌‌కు వెళ్లిన అన్నను తీసుకురావడానికి అమ్మతో కలిసి వెళ్లిన చిన్నారి బస్సు కింద పడి చనిపోయిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. భువనగిరి మండలం వడపర్తికి చెందిన శ్రీనివాస్– లతశ్రీ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు మోక్షిత్​పట్టణంలోని ఓ ప్రైవేట్‌‌‌‌ స్కూల్‌‌‌‌లో ఫస్ట్​క్లాస్​చదువుతున్నాడు. స్కూల్‌‌‌‌కు వెళ్లిన మోక్షిత్‌‌‌‌ను తీసుకొచ్చేందుకు లతశ్రీ చిన్నకొడుకు నిశాంత్(2)ను తీసుకొని బస్సు వద్దకు వెళ్లింది. నిశాంత్​ఆడుకుంటూ బస్సు వెనుక వైపు వెళ్లగా ఎవరూ గమనించలేదు. డ్రైవర్​బస్సును వెనక్కి తీయడంతో వెనుక టైరు కిందపడి నిశాంత్ చనిపోయాడు. చిన్నారి మృతితో తల్లి గుండెలవిసేలా రోధించింది. తండ్రి శ్రీనివాస్​ ఫిర్యాదు మేరకు రూరల్​ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.