ప్రధానిమోదీ విమానానికి.. యూఏఈ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్

ప్రధానిమోదీ విమానానికి.. యూఏఈ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ విమానానికి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్ ను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. శుక్రవారం (మే15)  అబిదాబికి చేరుకుంటున్న సమయంలో ప్రధాని మోదీ విమానానికి రక్షణగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తన యుద్ధ విమానాలను పంపింది.ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న బోయింగ్ 777-300ER విమానానికి, యూఏఈ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 బ్లాక్ 60  డెసర్ట్ ఫాల్కన్ యుద్ధ విమానాలు రక్షణగా వెళ్తున్న దృశ్యాల వీడియో వైరల్ అవుతోంది. 

పశ్చిమాసియాలో యుద్దం కారణంగా నెలకొన్న ఇంధన సంక్షోభం నడుమ  ప్రధాని మోదీ యూఏఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అబుదాబిలో దిగిన ప్రధాని మోదీకి యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు.  


ప్రధాని మోదీ, మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక  సహకార రంగాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఎల్ పీజీ, పెట్రోలియం నిల్లవ రంగాలు వంటి పలు కీలక ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశారు. ఈ ఒప్పందాలతో న్యూఢిల్లీ ,అబుదాబి మధ్య ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా యూఏఈ  మనదేశానికి మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ,పెట్టుబడులకు ఏడవ అతిపెద్ద వనరుగా ఉంది.