ఏడాది కాలంలో లాభం 22 శాతం

ఏడాది కాలంలో లాభం 22 శాతం

హైదరాబాద్​, వెలుగు: యూకో బ్యాంక్​ ఈ ఏడాది జూన్ 30తో ముగిసిన మొదటి క్వార్టర్​లో రూ.123.61 కోట్ల నికర లాభం పొందింది.  ప్రభుత్వ యాజమాన్యంలోని ఈ బ్యాంకు  2021-22 ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్​లో రూ. 101.81 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంటే ఈ ఏడాది కాలంలో లాభం 22 శాతం పెరిగింది.  మొత్తం ఆదాయం రూ.3,796.59 కోట్లకు తగ్గిందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో ఇది రూ.4,539.08 కోట్లని యూకో బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.

ఈ క్వార్టర్​లో వడ్డీ ఆదాయం రూ.3,851.07 కోట్లకు పెరగగా, ఇది ఏడాది క్రితం రూ.3,569.57 కోట్లుగా నమోదయ్యింది. గ్రాస్​ ఎన్​పీఏలు 9.37 శాతం నుంచి 7.42 శాతానికి తగ్గాయి. విలువ పరంగా, గ్రాస్​ ఎన్‌‌‌‌‌‌‌‌పీఏలు రూ.11,321.76 కోట్ల నుంచి రూ.9,739.65 కోట్లకు దిగొచ్చాయి.  నికర ఎన్‌‌‌‌‌‌‌‌పిఎలు కూడా ఏడాది క్రితం 3.85 శాతం ఉండగా ఈ జూన్ క్వార్టర్‌‌లో  2.4 శాతానికి తగ్గాయి. మొండి బకాయిల ప్రొవిజన్లు రూ. 1,127.11 కోట్ల నుంచి రూ. 246.83 కోట్లకు తగ్గాయి. ఇందులో ఎన్‌‌‌‌‌‌‌‌పీఏల కేటాయింపులు కూడా ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్​లో రూ.844.76 కోట్ల నుంచి రూ.267.56 కోట్లకు తగ్గాయి. బ్యాంక్ ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో 91.96 శాతంగా ఉంది.