నిజాం ఖజానా కేసు.. లీగల్ ఖర్చులను పాకిస్తాన్ భరించాలి: లండన్ కోర్టు

నిజాం ఖజానా కేసు.. లీగల్ ఖర్చులను పాకిస్తాన్ భరించాలి: లండన్ కోర్టు

దేశానికి స్వాతంత్య్రం వచ్చినపుడు…  హైదరాబాద్ సంస్థానానికి చెందిన ఖజానాను లండన్ లోని పాకిస్తాన్ హైకమిషనర్ కు పంపిన 10లక్షల పౌండ్లకు  చెందిన కేసులో…. 65శాతం లీగల్ ఖర్చులను భారత ప్రభుత్వానికి, నిజాం వారసులకు ఇవ్వాలని పాకిస్తాన్ ను ఆదేశించింది బ్రిటీష్ హైకోర్టు.

దేశ విభజన సమయంలో హైదరాబాద్ సంస్థానాన్ని సొంత దేశంగా ఉంచాలని లేకుంటే పాకిస్తాన్ లో కలపాలని పట్టుబట్టారు నిజాం నవాబు. ఆ టైంలో తన దగ్గర ఉన్న  10లక్షల పౌండ్ల నగదును లండన్ లోని నాట్ వెస్ట్ బ్యాంకుకు తరలించారు. కాలక్రమంలో.. పటేల్ తీసుకున్న సైనిక చర్యకు లొంగి..  హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం అయింది. అయితే ఆ 10లక్షల పౌండ్లు తమకే చెందుతుందని పాకిస్తాన్… లండన్ కోర్టుకెక్కింది. దీంతో భారత ప్రభుత్వం కోర్టులో పోరాడింది. దేశ ప్రభుత్వంతో…  నిజాంవారసులు చేతులు కలిపారు.

1948నుంచి వివాదం కొనసాగగా… 2013వ సంవత్సరం నుంచి కేసుకు సంబంధించిన వాదనలను లండన్ కోర్టు విన్నది. ఈ కేసులో నిజాంకు చెందిన ధనం.. భారత్ కు, నిజాం వారసులకు చెందుతుందని తీర్పును ఇచ్చింది కోర్టు. అయితే న్యాయ ఖర్చుల్లో 65శాతం ధనాన్ని భారత దేశానికి, నిజాం వారసులకు పాకిస్తాన్ చెల్లించాలని ఆదేశించింది లండన్ కోర్టు. 2013నుంచి కొనసాగుతున్న కేసు ఈనెల 19న ముగిసిందని చెప్పారు నిజాం తరపున వాధించిన న్యాయవాది హెవిట్.

కోర్టు ఉత్తర్వుల ప్రకారం… 1948నుంచి నిధిని భద్రపరిచినందుకు బ్యాంకుకు  3కోట్ల రూపాయలను, యువరాజు మఫకంజాకు 17కోట్ల రూపాయలను, భారతదేశానికి 25కోట్ల రూపాయలను, ఏడవ నిజాంకు 7కోట్లరూపాయలను చెల్లించాలని పాకిస్తాన్ ను ఆదేశించారు న్యాయమూర్తి.