ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బ్రిట‌న్ ప్ర‌ధాని

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బ్రిట‌న్ ప్ర‌ధాని

కరోనా వైరస్ బారిన ప‌డి చికిత్స నిమిత్తం ఐసీయూలో చేరిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్ ఆదివారం డిశ్చార్జ్‌ అయ్యారు. బ్రిటన్‌లోని సెయింట్ థామస్ ఆస్ప‌త్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్న ఆయ‌న… డిశ్చార్జ్ అనంత‌రం ఆస్ప‌త్రి సిబ్బంది నుద్దేశించి మాట్లాడారు. సెయింట్ థామస్ ఆస్పత్రిలో తనకు వైద్య సేవలు అందించిన నేషనల్‌ హెల్త్ స్టాఫ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయ‌న అన్నారు.వారి సేవ‌ల‌కు కేవ‌లం థ్యాంక్స్ మాత్రమే స‌రిపోద‌న్నారు. ఆస్ప‌త్రి సిబ్బందే త‌న ప్రాణాల‌ను కాపాడార‌ని అన్నారు.

బోరిస్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో గ‌త నెల‌ మార్చి 26 నుంచి ఆయన పెల్ఫ్ క్వారంటైన్ ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో డాక్ట‌ర్ల సూచన మేరకు ఏప్రిల్‌ 5న హాస్పిటల్‌కు వెళ్లారు. వ్యాధి తీవ్రత పెరగడంతో ఆయన్ను ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. స‌రిగ్గా వారం రోజుల ట్రీట్ మెంట్ అనంత‌రం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.తెలిపాయి.ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, గతంలో కంటే ఆయన ఆరోగ్యం మరింత మెరుగైందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.