ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్

ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్

టీమిండియా బౌలర్ ఉమ్రాన్ మాలిక్ రికార్డు సృష్టించాడు. టీమిండియా తరఫున అత్యధిక వేగవంతమైన బాల్ వేసిన బౌలర్‌గా ఉమ్రాన్ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో  బుమ్రా, షమీ, నవ్‌దీప్ సైనీ రికార్డులను ఉమ్రాన్ అధిగమించాడు. బుమ్రా గంటకు 153.36 కి.మీ వేగంతో టాప్‌లో ఉండగా.. షమీ 153.3 కి. మీ వేగంతో రెండో స్థానంలో.. నవ్‌దీప్ సైనీ గంటకు 152.85 కి.మీ  మూడు స్థానంలో ఉన్నారు. అయితే ఉమ్రాన్ ప్రస్తుతం అధిగమించాడు. లంకతో జరిగిన తొలి టీ20లో గంటకు 155 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ వేసి మ్యాచ్ ను మలుపుతిప్పాడు. 

ఫస్ట్ టీ20లో ఉమ్రాన్ మాలిక్ కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు. క్రీజులో పాతుకుపోయిన శ్రీలంక కెప్టెన్ డసన్ షనకను ఫాస్టెస్ట్ డెలవరీతో పెవీలియన్ చేర్చాడు. అంతకుముందు చరిత అసలంకను ఔట్ చేశాడు. మొత్తంగా 4 ఓవర్లు వేసిన ఉమ్రాన్ మాలిక్..27 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.