
- మల్లన్నను పల్లి బఠాణీ అమ్ముకునే వ్యక్తి అంటవా
- నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతా రాయ్
హైదరాబాద్: కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అవమానపరిచిన కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని నిరుద్యోగ జేఏసీ ఛైర్మెన్ మానవత రాయ్ డిమాండ్ చేశారు. మల్లన్నపై ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ లో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్లన్నను పల్లి, బఠాణీ అమ్ముకునే వ్యక్తిగా కించపరిచిన కేటీఆర్ ఓయూ విద్యార్థులను అవమానించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వెంటనే విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు.