వార్నర్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు

వార్నర్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్  53 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డ్ దక్కించుకున్నాడు. సెమీ ఫైనల్ లో 49 పరుగులతో  కీలక ఇన్నింగ్స్ ఆడాడు వార్నర్ . దీంతో ఈ టోర్నమెంట్ లో  డేవిడ్ వార్నర్ 289 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అయితే పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్ మెన్ బాబర్ అజామ్ 303 పరుగులతో హయ్యెస్ట్ రన్స్ తో మొదటి స్థానంలో ఉన్నాడు. దీంతో  డేవిడ్ వార్నర్ కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డ్ ఇవ్వడాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తప్పుబట్టాడు.  అత్యధిక పరుగులు చేసిన బాబర్ అజామ్ ను కాదని వార్నర్ కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ ఇవ్వడమేంటని ప్రశ్నించాడు. ఇది ఖచ్చితంగా తప్పుడు నిర్ణయమని అన్నాడు. బాబర్ కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ వస్తుందని ఎదురు చూశానన్నాడు.