గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య

గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య

శంషాబాద్, వెలుగు: గుర్తు తెలియని యువకుడు ఉరేసుకుని చనిపోయిన ఘటన శుక్రవారం రాత్రి 9:30 గంటలకు శంషాబాద్ హై వేపై గండిగూడ సమీపంలోని ఆటోనగర్ వద్ద జరిగింది. స్థానికులు చూసి శంషాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వచ్చి మృతుడి వద్ద ఆధారాలు వెతకగా లభించలేదు.  గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించి కేసు నమోదు చేసి.. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.