రాష్ట్రపతిని కలిసిన ఆర్థిక మంత్రి నిర్మల

రాష్ట్రపతిని కలిసిన ఆర్థిక మంత్రి నిర్మల

ఇవాళ కేంద్రం ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు చేరుకున్నారు. నిర్మలాతో పాటు.. ఆర్థిక శాఖ సహాయ మంత్రులు డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరద్, శ్రీ పంకజ్ చౌదరి మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, 2022-23 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే ముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. కరోనాతో రెండేళ్లగా సామాన్యుల జీవితాలు అతలాకుతలమయ్యాయి. థర్డ్‌వేవ్ ఉన్నప్పటికీ..ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది. 

ఈ తరుణంలో కేంద్రం ప్రవేశపెడుతున్న 2022-23 బడ్జెట్‌పై సాధారణ ప్రజలు  గంపెడాశలు పెట్టుకున్నారు. కరోనాతో ప్రజల జీవనప్రమాణాలు, ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ముఖ్యంగా జీతాలకోత, అలవెన్సుల తగ్గింపు, నిలిపివేతతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు...ఈ బడ్జెట్‌లో సేవింగ్స్‌ను పెంచే చర్యలు ప్రకటిస్తారని ఎదురుచూస్తున్నారు. అయితే వరుసగా నాలుగో ఏడాది నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇలా వరుసగా నాలుగేళ్లు పార్లమెంట్‌లో పద్దు ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రి నిర్మలమ్మే.