మున్నూరు కాపులను బీసీ–ఎలో చేర్చొద్దు:తెలంగాణ ప్రదేశ్​ గంగ పుత్ర సంఘం

మున్నూరు కాపులను బీసీ–ఎలో చేర్చొద్దు:తెలంగాణ ప్రదేశ్​ గంగ పుత్ర సంఘం

ఖైరతాబాద్, వెలుగు: మున్నూరు కాపులను బీసీ–డి నుంచిబీసీ–ఎ జాబితాలో చేర్చుతామని సీఎం రేవంత్​ప్రకటించడం బాధాకరమని తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే బీసీ–ఎలో 57 కులాలు ఉన్నాయని,వాటిలో చాలా వెనుక బడిన కులాలేనన్నారు.

ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన సమావేశంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు గడప శ్రీహరి, నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ బాగయ్య మాట్లాడుతూ.. ముదిరాజ్​లు రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి  చెందారని చెప్పారు. బీసీ–ఎ జాబితాలో ఉన్న కులాలన్నీ18 శాతం జనాభా ఉన్నవేనని, 10 శాతం మాత్రమే ఉన్న ముదిరాజ్ లను ఎట్టి పరిస్థితుల్లో బీసీ–ఎలో చేర్చొద్దని సీఎం రేవంత్​రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​కు తమ ఓట్లు కావాలనుకుంటే వెంటనే సీఎం చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలన్నారు. సమావేశంలో నగర అధ్యక్షుడు చాట్ల సదానంద్ తదితరులు పాల్గొని మాట్లాడారు.