ఇద్దరమ్మాయిలు పెళ్లి అంట.. ఉన్న మగాళ్లకే అమ్మాయిలు దొరక్కపోతే.. వీళ్లెవరండీ..

ఇద్దరమ్మాయిలు పెళ్లి అంట.. ఉన్న మగాళ్లకే అమ్మాయిలు దొరక్కపోతే.. వీళ్లెవరండీ..

సోషల్ మీడియా స్నేహం, సహజీవనం.. ఆపై పెళ్లి. బీహార్‌లోని సుపాల్ జిల్లాలో వెలుగుచూసిన ఒక వింత వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై ఇద్దరు అమ్మాయిలు పీకల్లోతు ప్రేమలో మునిగి, చివరికి గుడిలో పెళ్లిచేసుకుని ఒక్కటైన లవ్ స్టోరీ తెగ వైరల్ అవుతోంది. అసలే ఆడపిల్లలు దొరక్క మగవాళ్లు సింగిల్ చింతకాయల్లా మిగిలిపోతున్న రోజుల్లో ఇలా ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవటంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ లవ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మాధేపురకు చెందిన పూజా గుప్తా (21), కాజల్ కుమారి (18) అనే ఇద్దరు యువతుల మధ్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ త్రివేణిగంజ్‌లోని ఒక ప్రైవేట్ మాల్‌లో కలిసి పని చేయడం ప్రారంభించారు. గత రెండు నెలలుగా వీరిద్దరూ ఒకే అద్దె గదిలో సహజీవనం కూడా చేస్తున్నారు. మగవాళ్లతో కంఫర్ట్ ఫీల్ అవ్వలేమని గుర్తించిన వీరు ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో వాళ్లు వద్దన్నా, సమాజంలో ఇది అసహజంగా కనిపించినా తాము మాత్రం మనసుకు నచ్చిందే చేయాలని డిసైడ్ అయ్యారు. 

దీంతో ఈ జంట తమ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం రాత్రి త్రివేణిగంజ్ మేళా మైదానంలోని ఒక ఆలయానికి చేరుకున్నారు. అక్కడ సంప్రదాయబద్ధంగా హోమం చేయడానికి అగ్నిగుండం అందుబాటులో లేకపోవడంతో, వారు ఎవరూ ఊహించని పని చేశారు. ఒక గ్యాస్ స్టవ్ వెలిగించి.. దాన్నే పవిత్ర అగ్నిగా భావించి దాని చుట్టూ 7 అడుగులు వేసి ఒక్కటయ్యారు. పూజా గుప్తా వరుడుగా.. తన లవర్ కాజల్ వధువుగా మారి దండలు మార్చుకున్నారు. ఈ వెరైటీ పెళ్లికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది.

బుధవారం ఉదయం ఈ విషయం పొరుగువారికి తెలియడంతో.. వారు అద్దెకు ఉంటున్న గదికి ముందు భారీగా జనం గుమిగూడారు. దీనిపై స్థానికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని 'హ్యూమన్ రైట్స్' వ్యక్తిగత స్వేచ్ఛగా సమర్థిస్తుండగా, మరికొందరు సామాజిక సంప్రదాయాలను ఉల్లంఘించారని విమర్శిస్తున్నారు. అయితే తామిద్దరం మేజర్లుగా ఉన్నామని, పూర్తి స్పృహతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎవరి ఒత్తిడి లేదని ఆ కొత్త జంట స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ లెస్బియన్ మ్యారేజ్ బీహార్‌లోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సంప్రదాయాలకు, ఆధునిక భావాలకు మధ్య జరుగుతున్న ఈ చర్చలో కొత్త జంట మాత్రం తాము చాలా సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు.